సుజుకి మోటార్ సైకిల్ ఇండియా సరికొత్త స్కూటర్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. బర్గ్ మన్ స్ట్రీట్ ఈఎక్స్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఈ స్కూటర్లో ఎఫ్ఐ టెక్నాలజీతో పాటు ఎకో పర్ఫామెన్స్ ఆల్ఫా ఇంజన్ తో 124సీసీ మోటార్ ను అమర్చింది. ఇది 8.6ps గరిష్ట శక్తిని, 10Nm గరిష్ట టార్క్ ను అందిస్తుంది. ఆటో స్టాప్- స్టార్ట్ సిస్టమ్, సైలెంట్ స్టార్టర్ సిస్టమ్ లాంటి ప్రత్యేక ఫీచర్లను అందుబాటులో ఉంచింది. బ్లూటూత్ డిజిటల్ ఎనేబుల్డ్ కన్సోల్ తో కూడిన సుజుకీ రైడ్ కనెక్ట్ ఫీచర్ ను అందించింది. దీంతో స్మార్ట్ ఫోన్ ను స్కూటర్ కు సింక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ ధరను రూ1,12,300 గా కంపెనీ నిర్ణయించింది.