వచ్చే వేసవి భారత్ లో ఉగ్రరూపం చూపించనుందని వరల్డ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. వడగాల్పులు ఎక్కువరోజులు కొనసాగి ప్రమాదకరంగా మారుతాయని తెలిపింది. ఈ అధిక ఎండలు మనిషి ఆయుష్షును తగ్గిస్తాయని, ఆర్థికంగా తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంది. దేశంలో దాదాపు 38 కోట్ల మంది ఎండల్లో పని చేస్తారని, వీరందరికీ దీర్ఘకాలిక ముప్పు ఉంటుందని వెల్లడించింది. రానున్న వేసవికాలంలో భారత్ లో ఏసీలు, కూలర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని తెలిపింది.