అతివేగం ఓ పోలీస్ అధిరి, ఆయన భార్యను బలితీసుకున్న విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీఐ రవి ఉక్కుంద, ఆయన భార్య మధు కలబుర్గిలో సొంత పనులు ముగించుకొని సింధగికి కారులో వెళ్తున్నారు. జేవర్గి తాలుకా నెలోగి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఆగి ఉన్న కంటైనర్ లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో సీఐ రవి, ఆయన భార్య అక్కడికక్కడే మృతిచెందారు. ప్రస్తుతం విజయపుర జిల్లా సింధగి సీఐగా రవి విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు 10 ఏళ్ల లోపు కొడుకు కూతురు ఉన్నారు. అతివేగంతో పాటు, పొగమంచుతో దారి కనిపించకపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.