Technology | Suryaa Desk | Published :
Tue, Dec 20, 2022, 04:31 PM
సెర్చ్ ఇన్ వీడియో (Search in Video) పేరుతో యూట్యూబ్ సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు వీడియోలో తమకు నచ్చిన అంశం గురించి సులువుగా వెతకొచ్చు. ఉదాహరణకి యూట్యూబ్‌లో యూజర్ దిల్లీ గురించిన వీడియో చూస్తుంటే అందులో దిల్లీలోని ఎర్రకోట ఎలా ఉందో చూడాలనుకుంటే? వీడియోలో కుడివైపు కింద భాగంలో సెర్చ్‌బార్ ఆప్షన్‌పై క్లిక్ చేసి Redfort అని టైప్ చేస్తే వీడియోలో దానికి సంబంధించిన విజువల్స్ వస్తాయి. దీంతో యూజర్‌కు కావాల్సిన కంటెంట్ సులువుగా దొరకడం సహా సమయం ఆదా అవుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com