దేశంలో యూట్యూబ్ ఛానల్స్ హవా అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే హద్దులు మీరుతున్న యూట్యూబ్ ఛానల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేక్ వార్తలు సృష్టించి, జాతి, ప్రభుత్వ, మత వ్యతిరేక ప్రచారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్న ఛానల్స్, సోషల్ మీడియాకు ప్రెస్ ఇన్మర్మేషన్ బ్యూరో (పీఐబీ) కళ్లెం వేస్తోంది. ఇకపై తప్పుడు వార్తలు, ఫేక్ కంటెంట్ ప్రచారం చేస్తే ఆ ఛానల్ ను బ్యాన్ చేయడం సహా యజమానికి జైలుశిక్ష విధించనుంది. కాగా, ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానల్స్ ను పీఐబీ బ్లాక్ చేసింది.