ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీ వీకే సక్సేనా మధ్య విభేదాలు ముదిరాయి. ప్రభుత్వ ప్రకటనలను ఆప్ పార్టీ సొంత ప్రచారానికి వాడుకుందంటూ ఆయన విమర్శలు చేశారు. ఇందుకు సంబంధించిన రూ.97 కోట్లు పార్టీ నుంచి వసూలు చేయాలని సీఎస్ ను ఆదేశించారు. ఈ ఆదేశాలపై ఆప్ ఘాటుగా స్పందించింది. అసలు గవర్నర్ కు ఆ అధికారమే లేదని పేర్కొంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇలానే ప్రకటనలు చేస్తుందని, అయితే ఆప్ ను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడింది. బీజేపీ మొత్తం రూ.22 వేల కోట్లు ప్రభుత్వ ప్రకటనల పేరుతో ఖర్చు చేసిందని.. అది పార్టీ నుంచి వసూలు చేసిన తర్వాత తాము చెల్లిస్తామని చెప్పుకొచ్చింది.