దేశీయ టూవీలర్ల తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ నూతన బైక్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తన ఎక్స్ పల్ 200టీ మోడల్ లో కొత్త వెర్షన్ ను లాంచ్ చేసింది. ఈ బైక్ ధర ముంబై ఎక్స్ షోరూంలో రూ.1.25 లక్షలుగా నిర్ణయించింది. ఈ బైకులో బీఎస్ 6 200 సీసీ 4 వాల్వ్ ఇంజన్ ను అమర్చారు. ఇది 19 హెచ్ పీ పవర్, 17.3 ఎన్ఎం టార్క్ తో రాబోతుంది. గోల్డ్, రెడ్, ఎల్లో మేట్ ఫంక్ వంటి కలర్స్ లో ఈ బైక్ అందుబాటులో ఉంది. ఈ బైక్ లో 37 ఎంఎం ఫ్రంట్ ఫోర్క్స్, వెనక భాగంలో 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ అమర్చారు. ఈ బైక్ ను కొనుగోలు చేయాలనుకుంటున్న వారు కంపెనీ వెబ్ సైట్ లో రూ.2500తో ప్రి బుకింగ్ చేసుకోవాలని తెలిపారు.