విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్శంగా విశాఖ సాగర తీరంలో రుషికొండ వద్ద కొలువు దీరిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం వేకువజామున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వారానికి పూజలు చేసి ఆలయంలోకి ప్రవేశించారు. టీటీడీ అధికారులు స్వాత్మానందేంద్ర స్వామికి తొలి దర్శనం కల్పించారు. పండితులు, అధికారులు స్వామీజీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి విశిష్టతను వివరించారు.