ఇటాలియన్ సూపర్ బైక్స్ తయారీ సంస్థ ‘డుకాటీ’ ఈ ఏడాది భారత్ లో స్ట్రీట్ ఫైటర్ వీ4 లంబోర్గీని మోడల్ ప్రవేశ పెట్టనుంది. 208 హెచ్ పీ పవర్ తో 1,103 సీసీ ఇంజిన్ తో ఈ బైక్ రూపుదిద్దుకుంది. డుకాటీ క్విక్ షిప్ట్ తో 6 స్పీడ్ గేర్ బాక్స్, హైడ్రాలికల్లీ కంట్రోల్డ్ స్లిప్పర్ డ్రై క్లచ్ ఏర్పాటు చేశారు. ఎక్స్ షోరూంలో దీని ధర రూ.72 లక్షలు ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు మరో 8 మోడళ్లు 2023లో భారత్ లో రంగ ప్రవేశం చెయ్యనున్నాయి. ఈ బైక్స్ రూ.10.39 లక్షల నుంచి లభిస్తాయి.