కేవైసీ ప్రక్రియపై అన్ని బ్యాంకుల ఖాతాదారులకు ఆర్బీఐ కీలక సూచన చేసింది. కేవైసీ సమాచారంలో ఎలాంటి మార్పు లేకపోతే రీకేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఖాతాదారులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని వెల్లడించింది. ఇందుకోసం బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేదని.. అకౌంట్ కు లింకైన మెయిల్, ఫోన్, ఏటీఎం, ఆన్ లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేలా ఖాతాదారులకు అవకాశం కల్పించాలని బ్యాంకులను ఆదేశించింది.