స్టాక్ ఎక్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈకి ఎండీ, సీఈవోగా సుందరరామన్ రామ్మూర్తి ఎంపికయ్యారు. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రామ్మూర్తి ఎంపికకు గత నెలలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీఎస్ఈ పేర్కొంది. అయితే ఈ ఆఫర్ ను ఆయన ఆమోదించాల్సి ఉన్నట్లు తెలియజేసింది. కాగా, బీఎస్ఈ గత సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ గతేడాది జులైలో పదవి నుంచి తప్పుకొని మరో దిగ్గజ స్టాక్ ఎక్ఛేంజీ ఎన్ఎస్ఈకి వెళ్లారు.