దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ గ్రాండ్ విటారాలో సీఎన్జీ వెర్షన్ ను విడుదల చేసింది. డెల్టా, బీటా వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది. వీటి ధర వరుసగా రూ.12.85 లక్షలు, రూ.18.84 లక్షలు. ఈ కారు మైలేజీ కేజీకి 26.6 కి.మీగా కంపెనీ తెలిపింది. ఈ కారులో 1.5 లీటర్ ఇంజిన్ అమర్చారు. దీంట్లో యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో,కొత్త తరం సుజుకీ కనెక్ట్, ఆరు ఎయిర్ బ్యాగ్ లు వంటి ఫీచర్లు ఉన్నాయి.