ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఈ ఏడాది చివరి నాటికి శాటిలైట్ కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ప్రసిద్ధ చిప్ ల తయారీ సంస్థ క్వాల్కమ్, శాటిలైట్ ఫోన్ కంపెనీ ఇరిడియంకు మధ్య ఒప్పందం కుదిరినట్లు బీబీసీ తన కథనంలో వెల్లడించింది. దీంతో మొబైల్ కవరేజీ సరిగా లేని ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ల ద్వారా ఉపగ్రహాల సమాచారాన్ని పంపి, రిసీవ్ చేసుకునేందుకు వీలవుతుంది.