రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగిస్తున్న జగన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో తరిమికొట్టాలని గుంతకల్లు నియో జకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఆర్. జితేంద్రగౌడు అన్నారు. శుక్రవారం గుత్తి మండల పరిధిలోని పెద్దోడ్డి గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా జితేంద్రగౌడు ఇంటింటికీ వెళ్లి సీఎం జగన్ రెడ్డి పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్రంలో సీఎం జగన్ రెడ్డి అరాచక పాలన చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు నాయుడు కు వస్తున్న ప్రజాదరణ చూసి భయపడి ఆయన ప్రజల్లో తిరగకుండా చీకటి జిఓ తెచ్చాడన్నారు. జగన్ రెడ్డి దుష్ట పాలనను రానున్న ఎన్నికల్లో తుద ముట్టించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు అనిల్ కుమార్ గౌడ్, మండల కన్వీనర్ బల్దీవలి తదితరులు పాల్గొన్నారు.