ఎన్నారైలకు శుభవార్త. ఇకపై 10 దేశాల ఎన్నారైలు డిజిటల్ చెల్లింపులకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ యాప్ సేవలు పొందొచ్చు. వారుంటున్న దేశం నుంచి ఎన్నారై బ్యాంకు ఖాతా ద్వారా నగదు చెల్లింపులు జరపవచ్చు. తొలి దశలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, హాంగ్ కాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ, యూఏఈ దేశాల్లో ఉంటున్న వారికి ఈ సేవలు అందబాటులోకి రానున్నాయి.