మధుమేహం మహమ్మారి యువతనూ కబళిస్తోంది. 2019-21 మధ్య జరిపిన సర్వేలో ఏపీ, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, గోవా, త్రిపుర రాష్ట్రాల్లో 35 ఏళ్ల లోపు వారిలో డయాబెటిస్ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 8 శాతానికి మించి ఉందని తేలింది. వంశపారంపర్యం, కాలుష్యం, మితిమీరిన ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు ఈ వ్యాధికి దారి తీస్తాయని.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.