దేశంలో ప్రముఖ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ ఛైర్మన్, ఎండీ అనిల్ శర్మపై సీబీఐ హత్య కేసు నమోదు చేసింది. బీహార్ లఖిసరాయ్ లోని బాలికా విద్యాపీఠం కార్యదర్శి డాక్టర్ శరత్ చంద్ర హత్యకేసులో ఆయన హస్తం ఉందని సీబీఐ పేర్కొంది. విద్యాపీఠం భూములు, ఆస్తుల కోసం అనిల్ శర్మతో పాటు మరో ఐదుగురు కుట్ర పన్నారని.. అందులో భాగంగానే ఈ హత్య జరిగిందని వెల్లడించింది. కాగా, 2014, ఆగస్ట్ 8న శరత్ చంద్రను దుండగులు హత్య చేశారు.