టెక్ దిగ్గజాలు లేఆఫ్స్, పింక్ స్లిప్పుల కలకలంతో ఉద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో వారికి వేతన పెంపుపై శుభవార్త వెలువడింది. భారత్ లో ఈ ఏడాది సగటు జీతం 10 శాతం పెరిగే అవకాశం ఉందని కాన్ ఫెర్రీ తాజా వేతన సర్వే వెల్లడించింది. 818 సంస్థలు, 8 లక్షలకు పైగా ఉద్యోగులపై జరిపిన సర్వేలో ఈ ఏడాది సగటున 9.8 శాతం వేతన పెంపు ఉండొచ్చని సర్వే పేర్కొంది.