ఓలా సంస్థ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది. ఎస్1 శ్రేణిలో రూ.99,999 ధరతో కొత్త వేరియంట్ రిలీజ్ చేసింది. 2 కిలో వాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో తెచ్చిన ఈ స్కూటర్ ఒకసారి ఛార్జింగ్ పై 91 కి.మీ ప్రయాణిస్తుంది. అలాగే ఎస్1 ఎయిర్ పేరుతో మరో 3 వేరియంట్లు విడుదల చేసింది. రూ.84,999 ధర ఉన్న స్కూటర్, 2 కిలోవాట్ బ్యాటరీ, 85 కి.మీ, 3 కిలో వాట్ అవర్ వేరియంట్ 125 కి.మీ, 4 కిలో వాట్ అవర్ వేరియంట్ స్కూటర్ 165 కి.మీ వెళ్తాయి. వీటి ధర వరుసగా రూ.99,999, రూ.1.09 లక్షలుగా ఉన్నాయి.