మారుతి సుజుకీ 2023 సంవత్సరాన్ని జోష్ ఫుల్ గా మొదలుపెట్టింది. జనవరిలో విక్రయించబడిన టాప్ 10 కార్ల జాబితాలో 7 మోడళ్లు మారుతీ కంపెనీవే. అమ్మకాల్లో మారుతీ ఆల్టో చార్ట్ టాపర్ గా నిలిచి సత్తా చాటింది. దాని తర్వాత స్థానాన్ని వేగన్ ఆర్ దక్కించుకుంది. ఆ తర్వాత మారుతి స్విఫ్ట్, బాలెనో, నెక్సాన్, హ్యుందాయ్ క్రెటా, మారుతీ బ్రెజా, టాటా పంచ్, మారుతీ ఈకో, మారుతీ డిజైర్ నిలిచాయి. హ్యుందాయ్ మోటార్ బెస్ట్ సెల్లర్ క్రెటా ఈ జాబితాలో ఏకైక కొరియన్ మోడల్ గా నిలిచింది.