అరకులోయ మండలంలోని గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. అరకులోయ మండలంలోని వెన్నెల హోటల్ ఓనర్ నూకరాజు అరకులోయ వైపు నుంచి తమ స్వగ్రామమైనా అరకుకి స్కూటీపై వెళ్తుండగా జీ. మాడుగుల మండలానికి చెందిన వ్యక్తి అరకులోయ వైపు పల్సర్ బైక్ మీద వస్తూ. అరకు బురద గెడ్డ సమీపంలో రాంగ్ రూట్ పై వచ్చి స్కూటీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న నూకరాజుకి తీవ్ర గాయాలు కాగా ఘటన చోటుకి స్థానికులు హుటాహుటిన చేరుకుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగక్కపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.