దేశంలో బైక్స్ కు డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. మంచి మైలేజ్ ఇచ్చే టాప్ 5 మోడళ్లు పరిశీలిస్తే, టీవీఎస్ స్పోర్ట్ కు మార్కెట్ లో మంచి ఆదరణ ఉంది. ఇది లీటరుకు 70 కి.మీ మైలేజీ అందిస్తుంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ 97.2 సీసీ బీఎస్ 6 ఇంజిన్ తో లీటర్ పెట్రోలుకు 65 కి.మీ మైలేజీ ఇస్తుంది. అలాగే హోండా ఎస్ పీ 125 బైక్ 124 సీసీ బీఎస్ 6 ఇంజిన్ తో లీటరుకు 65 కి.మీ మైలేజ్ ఇస్తుంది. హోండా లివో, హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ టెక్ బైక్స్ మంచి లీటరుకు 58, 60 కి.మీ మైలేజీ ఇస్తాయి.