కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రశంసలు కురిపించారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి ఈ బడ్జెట్ తో పునాది పడిందని వ్యాఖ్యానించారు. మూలధన వ్యయంలో దేశం వృద్ధి సాధించేందుకు వీలుగా కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని అన్నారు. యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ సందర్భంగా ముకేశ్ అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు.