యమహా ఎఫ్ జెడ్ఎస్ వీ4 బైక్ మరిన్ని కొత్త ఫీచర్లతో స్టైలిష్ డిజైన్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఎల్ఈడీ డీఆర్ఎల్ లతో కూడిన మస్క్యులర్ లుకింగ్ హెడ్ లైట్, రంగులతో కూడిన టైర్లు, త్రీడీ ఎంబ్లెమ్, 136 కేజీల తేలికైన బాడీతో ఈ బైక్ వచ్చింది. ఈ బైక్ ఇంజిన్ సామర్థ్యం 12.2 bhp. ఈ బైక్ 13.3 ఎన్ఎం టార్క్, 5 స్పీడ్ గేర్ బాక్స్ తో పని చేస్తుంది. ఈ బైక్ మెటాలిక్ గ్రే, మెజెస్టీ రెడ్, మెటాలిక్ బ్లాక్ కలర్స్ లో లభిస్తోంది. ఈ బైక్ ధర రూ.1.27 లక్షలుగా ఉంది.