కార్ల దిగ్గజం తన వెర్నా కారును సరికొత్తగా ముస్తాబు చేసి భారత మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇటి 4 ట్రిమ్ ఆప్షన్స్ లో లభిస్తోంది. అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ ఫీచర్లకు, కంఫర్ట్ కు ఈ మోడల్ లో పెద్దపీట వేసినట్లు సంస్థ చెబుతోంది. 1.5 లీటర్ ఎంపీఐ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లలో వస్తోంది. పాత మోడల్ తో పోలిస్తో ఫ్రంట్ గ్రిల్ పూర్తిగా మార్చేశారు. ఈ కారుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఇప్పటికే భారత్ లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.