ఇటీవల కుక్క కరిచిన ఘటనలు ఎక్కువవుతున్నాయి. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని ధారగా పడుతున్న నీటి కింద కడగాలి. ఆ తర్వాత 2, 3 చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని వేసి శుభ్రం చేయాలి. యాంటీ బయోటిక్ క్రీమ్ రాసి బ్యాండేజ్ తో కట్టు కట్టాలి. అనంతరం వైద్యుని సూచన మేరకు మెడిసిన్ వాడాలి. కుక్క కరిచిన చోట తీవ్రనొప్పి, వాపుతో గాయం ఎర్రగా మారి.. జ్వరం, తల తిరగడం, చెమట ఎక్కువగా పోయడం వంటి లక్షణాలుంటే ఇన్ఫెక్షన్ సోకిందని అనుమానించాలి.