అమెజాన్ అలెక్సా గురించి తెలియను వారుండరు. ఇప్పటివరకు కేవలం మహిళల వాయిస్ తోనే అలెక్సా సేవలు అందించేది. ఇకపై పురుషుల వాయిస్ తోనూ అలెక్సా స్పందించనుంది. భారత్ లో మొదటిసారి హిందీ, ఇంగ్లీష్ భాషలో ఈ సేవలు ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. వినియోగదారులు అలెక్సా యాప్ ద్వారా స్వరాన్ని మార్చుకోవచ్చని, లేదంటే 'అలెక్సా.. ఛేంజ్ యువర్ వాయిస్' అంటే సరిపోతుందని సంస్థ పేర్కొంది.