ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. నేడు ఉదయం దేశంలోని ఉత్తర ప్రాంతంలోని హల్‌మహెరాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. భూకంప కేంద్రం ఇండోనేషియాకు ఉత్తరాన హల్మహెరాలో ఉపరితలం నుండి 99 కి.మీ దిగువన ఉందని ఎన్‌సీఎస్ తెలిపింది. కాగా, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.