ధాన్యం కొనుగోళ్లలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం రూ.1,611.27 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో ధాన్యం రైతులకు మొత్తం రూ.6,483.97 కోట్లు చెల్లించినట్లు సర్కారు తెలిపింది. గోనె సంచులు, హమాలీ, రవాణా ఛార్జీల కింద రూ.79.68 కోట్లను చెల్లించింది. 2022 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 6,01,147 మంది రైతుల నుంచి రూ.6,743.02 కోట్ల విలువైన 32,97,735 టన్నుల ధాన్యం సేకరించినట్లు ప్రభుత్వం తెలిపింది.