ఆడపిల్లలు స్కూలింగ్ తర్వాత చదువుకు స్వస్తి చెప్పకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని, పెళ్లయిన తర్వాత కూడా తమ వృత్తిలో రాణించాలని తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ అన్నారు. గురువారం విద్యోదయ పాఠశాలల శతాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులకు ఆత్మవిశ్వాసం కల్పించాలన్నారు. చదువు పూర్తయ్యాక ఆగకుండా కాలేజీకి వెళ్లాలని, పెళ్లి తర్వాత కూడా ఉద్యోగాలు చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa