ఏపీ మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె శరణి నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి మనీ రూటింగ్ కు పాల్పడినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. అలాగే 146 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారణకు రావడంతో హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇటీవలే కోర్టు ఆదేశించింది.