బెంగళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ కంపెనీ ’రైడర్ రివర్‘ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండీ (INDIE)ని లాంచ్ చేసింది. ఈ వెహికిల్‌ని స్కూటర్లలో SUVగా చెబుతోంది కంపెనీ. దీనికి 4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 120 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ పవర్ఫుల్ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.25 లక్షలు కాగా.. దీన్ని రూ,1,250కే బుక్ చేసుకోవచ్చని వివరించింది.