యులు, బజాజ్ ఆటో కంపెనీలు సంయుక్తంగా రెండు కొత్త స్కూటర్లను సోమవారం మార్కెట్ లోకి లాంచ్ చేశాయి. మిరాకిల్ జీఆర్, డీఎక్స్ జీఆర్ పేరుతో రెండు స్కూటర్లను తీసుకొచ్చాయి. ఈ రెండు స్కూటర్లు స్వాపింగ్ బ్యాటరీలతో పనిచేస్తాయి. గరిష్ఠ వేగం గంటకు 25 కి.మీ ఉంటుంది. ఈ స్కూటర్ల కోసం న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో 100 వరకు ఎనర్జీ స్టేషన్ లను ఏర్పాటు చేసినట్లు యులు కంపెనీ తెలిపింది.