భారత్‌లో 2023 జనవరిలో 29 లక్షల ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. వాటిలో 10,38,000 ఖాతాలను ముందస్తు హెచ్చరికలు లేకుండానే నిషేధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లలో దుర్వినియోగాన్ని నిరోధించడంలో తమ సంస్థ అగ్రగామి అని వాట్సాప్ పేర్కొంది. భారతీయ ఐటీ నిబంధనలు, యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిషేధం విధించినట్లు వెల్లడించింది.