ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో 108 అంబులెన్సులను ట్రాక్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని వైద్యశాఖ నిర్ణయించింది. సాయం కోసం ఫోన్ చేసిన వ్యక్తికి అంబులెన్స్ ట్రాకింగ్ లింకును, సిబ్బంది ఫోన్ నంబర్ ను పంపనుంది. దీనిద్వారా అంబులెన్స్ ఎంతసేపట్లో వస్తుందో ఈజీగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 748 అంబులెన్సులు రోజూ సగటున 3,096 కేసులను ఆస్పత్రికి తరలిస్తున్నాయి.