దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. యూనివర్సిటీ క్యాంపస్ లో ఇకపై ఎవరైనా ధర్నాలు చేస్తే వారి అడ్మిషన్ రద్దు చేయడంతో పాటు రూ.20 వేలు ఫైన్ విధించనుంది. ఒకవేళ హింసకు పాల్పడితే రూ.30 వేల జరిమానా కట్టాల్సి ఉంటుందని తెలిపింది. బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన విషయంలో ఇటీవల జరిగిన ఆందోళనల నేపథ్యంలో ఈ రూల్స్ తెచ్చింది.