జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను మచిలీపట్నంలో మార్చి 14న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొమ్మిదేళ్ల క్రితం పార్టీని పెట్టారని, వ్యక్తిగతంగా ఎన్నో అవమానాలు చేసినా ప్రజల కోసం నిలబడ్డారన్నారు. కాగా ఆరోజు సాయంత్రం 5 గంటలకు జరిగే సభకు పవన్ వస్తారని, మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహి వాహనంలో బయలు దేరతారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa