రైల్వేశాఖలో దాదాపు 3 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో క్లర్క్, స్టేషన్ మాస్టర్, టీసీ లాంటి గ్రూప్-సి పోస్టులు 3,11,438 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. గెజిటెడ్ క్యాడర్ హోదాలో 3,018 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. రైల్వే నియామకాలపై దాఖలైన ఆర్టీఐ పిటిషన్ కు సమాధానంగా కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది. దాదాపు అన్ని రైల్వే జోన్లలోనూ సిబ్బంది కొరత ఉన్నట్లు తెలిపింది.