సాధారణంగా అరటిలో పోషకాలు ఎక్కువ. అయితే, ఎర్ర అరటిలో ఎక్కువ పోషకాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిలోని పొటాషియం శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి బీపీని నియంత్రిస్తుందని పేర్కొంటున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీ6 రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయని చెబుతున్నారు. జీర్ణక్రియను కూడా ఎర్ర అరటి మెరుగు పరుస్తుందని అంటున్నారు.