ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య ఏడాది కాలంగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ యుద్ధాన్ని ఆపేందుకు వివిధ దేశాలను సంప్రదిస్తున్నట్లు చైనా వెల్లడించింది. ఇరు దేశాల మధ్య పరిస్థితులను చక్కదిద్దడంలో ప్రపంచ దేశాలు ముందుకువచ్చి కీలక పాత్ర పోషించాలని పేర్కొంది. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.