కొన్ని పండ్ల తొక్కలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ తొక్కలో జింక్, విటమిన్ ఏ, సీ, బీ6 పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచే లక్షణం తొక్కకు ఉంటుంది. సీజనల్ ప్రూట్ మామిడి పండు తొక్కలో ఫైటోన్యూట్రియెంట్స్ క్యాన్సర్ ప్రభావాన్ని అరికడతాయట. చిలగడ దుంప తొక్కలో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండటంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే తొక్కతో సహా తినడం బెటర్.