దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో కేవలం 3 కంపెనీలు మెజార్టీ వాటాను (60 శాతానికి పైగా) ఆక్రమిస్తున్నాయి. ఫిబ్రవరి నెల వాహన అమ్మకాల గణాంకాల ప్రకారం మొత్తం 65,000 యూనిట్లు అమ్ముడుపోగా, 17,616 యూనిట్లను ఓలా విక్రయించింది. టీవీఎస్ మోటార్స్ 12,568 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఏథర్ ఎనర్జీ సైతం 9,956 యూనిట్లను విక్రయించింది. ఆ తర్వాత స్థానాల్లో హీరో ఎలక్ట్రిక్, యాంపియర్, ఒకినవా ఉన్నాయి.