ఎంజీ మోటార్ సంస్థ కొత్తగా తీసుకొస్తున్న తమ ఎలక్ట్రిక్ వెహికల్ పేరును కామెట్ గా నిర్ణయించింది. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మాక్ రాబర్ట్ సన్ ఎయిర్ రేస్ లో 1934 బ్రిటిష్ ఎయిర్ ప్లేన్ నుంచి ప్రేరణ పొంది ఈ పేరును పెట్టినట్లు సంస్థ తెలిపింది. భవిష్యత్ తరాలకు తగ్గట్లు సాంకేతికత, స్వచ్ఛ రవాణాకు అవసరమైన ప్రత్యేక డిజైన్లు, సరికొత్త పరిష్కారాలను ఈ ‘కామెట్’తో సూచించనున్నట్లు సంస్థ పేర్కొంది.