ఏప్రిల్ 1 నుంచి కొత్త ఉద్గార ప్రమాణాలకనుగుణంగా సుజుకీ మోటార్స్ యాక్సెస్, అవెనిస్, బర్గ్ మ్యాన్ స్ట్రీట్స్ ను భారత మార్కెట్ లో విడుదల చేసింది. వీటిలో ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. వీటిలో E20 ఫ్యూయల్ (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్)తో నడిచే విధంగా ఇంజిన్లను అమర్చినట్లు తెలిపింది. త్వరలోనే మిగిలిన పోర్ట్ ఫోలియోను E20 ఫ్యూయల్ తో నడిచేలా తీర్చిదిద్దనున్నారు.