మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమైన వ్యవస్థలు నిర్భందానికి లోనవుతున్నాయని, తనపై నిఘా కోసం ప్రభుత్వం పెగాసస్ వాడుతోందని అన్నారు. శుక్రవారం రోజు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంపై దాడిని నిలువరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు.