ఈనెల 19వ తేదీ ఉదయం 11గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహం నుండి ఇందిరా మైదానం వరకు ర్యాలీగా తరలివచ్చి, నిర్వహించ తలపెట్టిన సాంస్కృతిక కళాగర్జనను విజయవంతం చేయాలంటూ సమత సైనిక్ దళ్ నాయకులు సురేష్, చెన్నకేశవులు, గండికోట సుబ్రహ్మణ్యం, రెడ్డప్ప, రాజేష్, గజపతి, ఉమామహేశ్వర్, రామ్మూర్తి లు వెల్లడించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో వీరు మాట్లాడుతూ ఈ ర్యాలీ బాలాజీ కాలనీ, ప్రకాశం రోడ్డు, గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు నుండి ఇందిరా మైదానం (బహిరంగ సభ) ప్రాంగణానికి చేరుకుంటుందని తెలియజేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్నామన్నారు. రైల్వే, బస్సు పాసుల్లో 50% రాయితీ మూడు ఎకరాల వ్యవసాయ భూమి కేటాయింపు, ఐదు సెంట్ల భూమిలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని, తాము ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలియజేశారు.