హర్యానా రాష్ట్రంలోని అంబాలా జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో 8 మంది మృతిచెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు యూపీలోని బరేలి నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని బడ్డీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కక్కర్ మజ్రా అనే గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.