ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ 'హోండా కార్స్ ఇండియా' రెండు కొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. న్యూ సిటీ (పెట్రోల్), న్యూ సిటీ ఈ:హెచ్ఈవీ పేరుతో కొత్త కార్లను తీసుకొచ్చింది. న్యూ సిటీ(ఐ-వీటెక్) ధర రూ.11.49 లక్షల నుంచి రూ.14.72 లక్షల వరకు ఉండగా, న్యూ సిటీ (ఈ:హెచ్ఈవీ) ధర రూ.18.89 లక్షల నుంచి రూ.20.39 లక్షల వరకు ఉంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 17.8 నుంచి 18.4 కి.మీ వరకు మైలేజీనిస్తుంది.