టాటా గ్రూప్ నకు చెందిన ‘స్ట్రైడర్’కంపెనీ జీటా ఇ-బైక్ ను నూతనంగా లాంచ్ చేసింది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీని 3 గంటల్లో ఫుల్ ఛార్జ్ చెయ్యొచ్చు. సింగిల్ ఛార్జ్ తో 40 కి.మీ ప్రయాణించొచ్చు. దీని అసలు ధర రూ.31,999 కాగా, పరిమిత కాలపు ఆఫర్ కింద 20 శాతం డిస్కౌంట్ తో రూ.25,599కే ఇ-బైక్ లభిస్తోంది. ఈ మోడల్ ఆకుపచ్చ, బూడిద రంగుల్లో అందుబాటులో ఉంది. ఇ-బైక్ కావాలనుకునే వారు వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు.