పాక్ రెచ్చగొట్టే చర్యలు చేస్తే భారత్ చూస్తూ ఊరుకోదని అమెరికన్ నివేదిక ఒకటి అంచనా వేసింది. సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గతంలో కంటే దీటుగా సైనిక శక్తితో ప్రతిస్పందించగలదని అమెరికన్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ అభిప్రాయపడింది. ఇటు భారత్-చైనా సంబంధాలపై కూడా స్పందించింది. బారత్-పాక్, భారత్-చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు నేపథ్యంలో ఘర్షణలకు అవకాశం ఉందని అంచనా వేసింది.